ప్రైవేటు రైళ్లు వచ్చేస్తున్నాయ్.. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి ‘ప్రైవేటు కూత’…..

0
9
ప్రైవేటు రైళ్లు వచ్చేస్తున్నాయ్.. సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి ‘ప్రైవేటు కూత’…..

న్యూస్‌టుడె:ముఖ్యంశాలు……

  • దేశవ్యాప్తంగా వంద ప్రైవేటు రైళ్లకు గ్రీన్ సిగ్నల్
  • దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఐదు రైళ్లు
  • అధునాతన సౌకర్యాలతో ప్రపంచస్థాయి సేవలు

అతి త్వరలో ఏపీ, తెలంగాణలో ప్రైవేటు రైళ్లు కూతపెట్టనున్నాయి. దక్షిణమధ్య రైల్వే పరిధిలో ఐదు ప్రైవేటు రైళ్లు నడిపేందుకు రైల్వే బోర్డు పచ్చజెండా ఊపింది. ప్రయాణికులకు ప్రపంచస్థాయి సేవలు అందించాలన్న ఉద్దేశంతో దేశంలో వంద ప్రైవేటు రైళ్లకు రైల్వే బోర్డు అనుమతి మంజూరు చేసింది. ఇందులో భాగంగా దక్షిణ మధ్య పరిధిలో ఐదు రైళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా అందులో మూడు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి నుంచి పరుగులు తీయనున్నాయి. ఏపీ, తెలంగాణలోని ప్రధాన నగరాలను కలుపుతూ అధునాతన సౌకర్యాలతో రైళ్లు తిరిగేలా ప్రైవేటు ఆపరేటర్లను ప్రభుత్వం ఎంపిక చేయనుంది.