రాహుల్‌కు దూరంగా కూర్చున్న ప్రియాంకా..ఎందుకంటారు..?

0
5
రాహుల్‌కు దూరంగా కూర్చున్న ప్రియాంకా..ఎందుకంటారు..?

గురువారం న్యూఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు పక్కప్కనే కాకుండా దూరంగా కూర్చోవడం కనిపించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ పక్కన కాకుండా మధ్యప్రదేశ్ గుణ ఎంపీ జోతిరాదిత్య సింధియా పక్కన ప్రియాంకా గాంధీ కూర్చున్నారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రియాంకా గాంధీ ఎందుకు రాహుల్‌కు దూరంగా కూర్చున్నారు..?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన పార్టీ సమావేశంలో ప్రియాంకా గాంధీ కావాలనే రాహుల్‌కు దూరంగా కూర్చొందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.ఇందుకు కారణం కూడా ఉందని చెబుతున్నారు. పార్టీ ఆమెకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తుందో.. అంతే ప్రాధాన్యత సీనియర్ నేతలకు కూడా ఇస్తుందని చెప్పేందుకే ప్రియాంకా దూరంగా కూర్చుని ఉంటారని సీనియర్ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ గతనెలలో పార్టీ అధిష్టానం నియమించింది.

ఇదిలా ఉంటే ఈ నెల 11 నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రియాంకా గాంధీ లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొదలుపెడుతారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నందున సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం డిసైడ్ చేసే అవకాశం ఉంది.

ఫిబ్రవరి 11న జరిగే ఎన్నికల ప్రచారంలో ప్రియాంకాగాంధీ, రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియాలు పాల్గొంటారు. ఇదిలా ఉంటే మనీలాండరింగ్ కేసులో ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాను ఈడీ విచారణ చేస్తోంది. ఇది రాజకీయకక్ష సాధింపే అని మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రియాంకా గాంధీ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here