ప్రియురాలి గొంతుకోసి ఆపై ప్రియుడి ఆత్మహత్యాయత్నం!

0
4
ప్రియురాలి గొంతుకోసి ఆపై ప్రియుడి ఆత్మహత్యాయత్నం!

హైదరాబాద్ :(టిన్యూస్10):న్యూస్‌టుడే 

  • హైదరాబాద్ లోని చైతన్యపురిలో ఘటన
  • యువతి పరిస్థితి విషమం
  • యువకుడికి ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స 

                          వివరాల్లోకి వెళితే…. హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ లో దారుణం జరిగింది. ప్రియురాలి గొంతును ఆమె ప్రియుడు కోసేశాడు. ఈ దారుణ సంఘటన చైతన్యపురిలోని బృందావనం లాడ్జిలో జరిగింది. ప్రియురాలి గొంతు కోసేసిన అనంతరం, ప్రియుడు తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రేమ జంటకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. యువకుడు వెంకటేశ్ ను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంకటేశ్ నెల్లూరు జిల్లాకు, యువతి బడంగ్ పేటకు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు.