తమిళ హీరో విజయ్ చనిపోయాడంటూ ప్రచారం… అసలు వాస్తవం ఏమిటంటే..!

0
2
తమిళ హీరో విజయ్ చనిపోయాడంటూ ప్రచారం… అసలు వాస్తవం ఏమిటంటే..!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  •  ‘రిప్ విజయ్’ పేరిట వైరల్ అయిన హ్యాష్ ట్యాగ్
  • కంగారుగా విజయ్ ని సంప్రదించిన ఫ్యాన్స్
  • ప్రచారం చేసింది అజిత్ అభిమానుల
తమిళ సూపర్ స్టార్ విజయ్ చనిపోయాడంటూ ‘రిప్ విజయ్’ పేరిట ఓ హ్యాష్ ట్యాగ్ గత కొన్ని గంటలుగా విపరీతంగా ట్రెండ్ కాగా, ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందారు. ఏమైందోనన్న కంగారులో ఎంతో మంది విజయ్ ని సంప్రదించారు కూడా. ఆపై విషయం తెలుసుకుని ఊరట చెందారు. ఇంతకీ ఏమైందంటే, కోలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య ట్విట్టర్ వేదికగా ఎటువంటి వార్ జరుగుతూ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
ఇటీవలి కాలంలో మరో హీరో అజిత్, విజయ్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇందులో భాగంగా ‘రిప్ విజయ్’ హ్యాష్ ట్యాగ్ ను అజిత్ ఫ్యాన్స్ వైరల్ చేశారు. విషయం తెలుసుకున్న విజయ్ ఫ్యాన్స్ ‘లాంగ్ లివ్ విజయ్’ అనే మరో హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తూ, మెత్తగా కౌంటరేశారు.