పురపాలికల్లో ఆస్తి పన్ను….

0
4
పురపాలికల్లో ఆస్తి పన్ను….

అమరావతి న్యూస్ టుడే: రాష్ట్రంలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థల పరిధిలో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాల్సిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. భవనాలు, ఖాళీ స్థలాలపై ఆస్తి పన్ను బకాయిలతోపాటు 2018-19 ఆర్థిక సంవత్సరపు పన్ను కూడా కలిపి ఒక్కసారే చెల్లిస్తే సదరు మొత్తాలపై వడ్డీ మాఫీ అవుతుందని పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం వచ్చే నెల 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇప్పటికే బకాయిలు చెల్లించినవారికి వడ్డీ రూపంలో చెల్లించిన నగదును భవిష్యత్తులో వారు చేయబోయే ఆస్తి పన్ను చెల్లింపుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here