హైదరాబాద్ బయలుదేరిన పీవీ సింధు… గచ్చిబౌలి వరకూ ఊరేగింపు!

0
5
హైదరాబాద్ బయలుదేరిన పీవీ సింధు… గచ్చిబౌలి వరకూ ఊరేగింపు!

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సింధు
  • ఆపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో భేటీ
  • మధ్యాహ్నం హైదరాబాద్ కు రాక

                                           వివరాల్లోకి వెళితే…స్విట్జర్లాండ్ లో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ పోటీల ఫైనల్స్ లో గెలిచి, భారతగడ్డపై కాలుమోపిన తెలుగుతేజం పీవీ సింధు, ఈ మధ్యాహ్నం హైదరాబాద్ కు చేరుకోనుంది. ఈ ఉదయం కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా సింధును అభినందించిన రిజిజు, సింధు స్ఫూర్తితో మరింత మంది బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించాలని పిలుపునిచ్చారు.  ఆపై ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్న సింధు, అటునుంచి హైదరాబాద్ కు బయలుదేరింది. కాగా, హైదరాబాద్ లో సిందుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓపెన్ టాప్ వాహనంలో ఆమెను గచ్చిబౌలి వరకూ ఊరేగింపుగా తీసుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.