ముల్లంగి, పల్లి పచ్చడి..

0
11
ముల్లంగి, పల్లి పచ్చడి..
ముల్లంగి పేరు వినగానే అబ్బో అంటారు చాలా మంది. కాని ముల్లంగి ఆరోగ్యానికి ఎంతో మంచిది తినాలంటారు డాక్టర్లు ..నిజానికి ముల్లంగి తో వంటకాలు రుచిగా వుంటాయి. ఆ రుచిని బాలన్స్ చేస్తూ అందులో దినుసులు వేస్తే..దోసల లోకి బావుంటుంది ఈ పచ్చడి . ఒకసారి చేసి చూడండి. పచ్చడిలో ముల్లంగి వాడారని మీరు చెబితే తప్ప తెలియదు ఎవ్వరికి.
కావలసిన పదార్ధాలు:
ముల్లంగి తురుము – ఒక కప్పు,
పల్లీలు – అర కప్పు,
పచ్చి మిర్చి- రెండు,
ఎండు మిర్చి – నాలుగు,
నువ్వులు – రెండు చెంచాలు,
ఆవాలు – పావు చెమ్చా,
ఇంగువ – చిటికెడు,
నూనె – 5 చెంచాలు,
ఉప్పు, పసుపు – తగినంత,
చింతపండు గుజ్జు – అర చెమ్చా.
తయారి విధానం:
ముందుగా పల్లిల్ని వేయించి పెట్టుకోవాలి..ఆ తర్వాత ఒక బాణలి లో రెండు చెంచాల నూనె వేసి ఆవాలు,పచ్చిమిర్చి ,నువ్వులు వేసి వేయించాలి. ఆఖరున ఎండు మిర్చి కూడా వేసి వేగాగానే ఇంగువ వేసి ఆపేయాలి. ఆ పోపుని తీసి పక్కన పెట్టి , అదే బాణలి లో ముల్లంగి తురుము వేసి ఒక అయిదు నిముషాలు వేయించాలి. చిటికెడు ఉప్పు వేసి మూత పెడితే తడి వచ్చి ..ఆ తడితో మెత్త పడుతుంది. అలా ఒక రెండు నిముషాలు వుంచి ఆపేయాలి. ఇప్పుడు ముందుగా పోపుసామను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆ పొడి లో పల్లీలు కూడా వేసి మళ్ళి తిప్పాలి. ఆఖరుగా ముల్లంగి , చింతపండు వేసి , కావలసిన ఉప్పు,పసుపు కూడా వేసి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ఆఖరున ఆవాలు,ఎండు మిర్చి, ఇంగువ తో పోపు చేసి పచ్చడి పయిన వేసి కలిపితే రుచిగా వుంటుంది.
                                                                                                               డెస్క్:దుర్గ