రాహుల్ గాంధీకి ఘాటు కౌంటర్.. విమానం పంపిస్తా.. రమ్మన్న కశ్మీర్ గవర్నర్…………

0
3
రాహుల్ గాంధీకి ఘాటు కౌంటర్.. విమానం పంపిస్తా.. రమ్మన్న కశ్మీర్ గవర్నర్…………

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…

  • జమ్ము,కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయన్న రాహుల్
  • బాధ్యత కలిగిన వ్యక్తి ఇలా మాట్లాడడం సరికాదన్న గవర్నర్
  • కాంగ్రెస్ నేతల మాటలకు రాహుల్ సిగ్గుపడాలన్న సత్యపాల్ మాలిక్

ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము,కశ్మీర్‌లో హింస చెలరేగుతోందంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్రంగా స్పందించారు. రాహుల్ కోసం ప్రత్యేకంగా ఓ విమానం పంపుతానని, వచ్చి ఇక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి చూసుకోవచ్చని పేర్కొన్నారు. రాహుల్‌ను బాధ్యత కలిగిన నాయకుడిగా అభివర్ణించిన సత్యపాల్ మాలిక్.. ఆయన ఇలాంటి బాధ్యతా రహితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.