కోస్తాలో వర్షాల జోరు…….

0
19
కోస్తాలో వర్షాల జోరు…….

సాధారణంగా రధసప్తమి అనంతరం ఎండలు మండిపోతాయని జనం భయపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవనుకుంటారు. కానీ ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్నమైన వాతావరణం నెలకొంది. అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. ఒకటి రెండు భారీ వర్షాలు ఇప్పటికే కురవగా శనివారం, ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ, హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.