3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం…

0
6
3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం…

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
  • తెలంగాణలో 24 గంటల్లో ఓ మోస్తరు వర్షం
  • అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన మాంద్యం

                                      వివరాల్లోకివెళితే… తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, మరో 48 గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశాలున్నాయని చెప్పారు. ఈ కారణంగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. ముఖ్యంగా తెలంగాణలో 24 గంటల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపారు. కాగా, అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అల్పపీడన మాంద్యం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ప్రకటన చేశారు. అది తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపనుంది.