తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల రాజమౌళి స్పందన………

0
1
తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు దక్కడం పట్ల రాజమౌళి స్పందన………

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • మహానటి, రంగస్థలం, అ!, చి.ల.సౌ చిత్రాలకు నేషనల్ అవార్డులు
  • సంతోషం వ్యక్తం చేసిన రాజమౌళి
  • ఈసారి మరిన్ని తెలుగు చిత్రాలకు జాతీయ అవార్డులు వచ్చాయంటూ ట్వీట్

టాలీవుడ్ లో ప్రజాదరణ పొందిన పలు చిత్రాలకు జాతీయ చలనచిత్ర అవార్డులు దక్కడం పట్ల దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ఈసారి తెలుగు చిత్రాలకు మరిన్ని అవార్డులు దక్కడం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని ట్విట్టర్ లో తన స్పందన తెలియజేశారు. 66వ జాతీయ అవార్డుల్లో పురస్కారాలకు ఎంపికైన ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి.ల.సౌ’ చిత్ర బృందాలకు శుభాకాంక్షలు తెలిపారు.’మహానటి’ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం అవార్డుతో పాటు, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పురస్కారం కూడా దక్కించుకుంది. 80ల నాటి కథాంశంతో రూపుదిద్దుకున్న ‘రంగస్థలం’ చిత్రం నేషనల్ అవార్డుల్లో ఉత్తమ ఆడియోగ్రఫీ పురస్కారం కైవసం చేసుకోగా, ప్రయోగాత్మక చిత్రం ‘అ!’ బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో నేషనల్ అవార్డుకు ఎంపికైంది. విశేష ప్రజాదరణ పొందిన ‘చి.ల.సౌ’ చిత్రానికి ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ పురస్కారం లభించింది.