రాజన్న రాజ్యం రావాలంటే….

1
6
రాజన్న రాజ్యం రావాలంటే….

పొన్నూరు న్యూస్‌టుడే: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం గుంటూరు జిల్లా పొన్నూరులో బహిరంగ సభలో వైఎస్‌ షర‍్మిల మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, కుల,మత, పార్టీలకు అతీతంగా న్యాయం చేసిన ఏకైక నాయకుడు వైఎస్సార్‌ అని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు.  జగనన్న బంపర్‌ మెజార్టీతో గెలుస్తాడని దేశవ్యాప్తంగా సర్వేలు చెబుతున్నాయన‍్న ఆమె… అన్నకు ఒక అవకాశం ఇస్తే మళ్లీ రాజన్న రాజ్యం తెస్తారన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే మళ్లీ జగనన్న రావాలని ఆకాంక్షించారు. జగరబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటువేసి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కిలారు రోశయ్యను ఆశీర్వదించాలని వైఎస్‌ షర‍్మిల కోరారు.                                                                                                                                  డెస్క్: లక్ష్మీ         

1 COMMENT

Comments are closed.