బెంగళూరు అభిమానులకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్………

0
7
బెంగళూరు అభిమానులకు క్షమాపణ చెప్పిన రామ్ చరణ్………

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • ఆదివారం బెంగళూరులో సైరా ప్రీరిలీజ్ ఈవెంట్
  • ఆడిటోరియం వెలుపలే నిలిచిపోయిన అభిమానులు
  • స్థలం సరిపోలేదంటూ వివరణ ఇచ్చిన రామ్ చరణ్

చిరంజీవి నటించిన సైరా చిత్రం అక్టోబరు 2న విడుదల కానున్న నేపథ్యంలో ఆదివారం నాడు బెంగళూరులో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహించిన ఆడిటోరియంలో స్థలాభావం వల్ల ఎక్కువమంది అభిమానులకు ప్రవేశం కల్పించలేకపోయారు. దాంతో లోపలున్న వాళ్లకంటే ఎక్కువ సంఖ్యలో అభిమానులు బయటే ఆగిపోవాల్సి వచ్చింది. దీనిపై రామ్ చరణ్ స్పందించారు.అభిమానులు తమను క్షమించాలని కోరారు. మీ ప్రేమే మాకు బలం అంటూ పేర్కొన్న చరణ్, హాల్ సరిపోలేదని, దాంతో చాలామంది అభిమానులకు నిరాశ కలిగించినందుకు సారీ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. అయితే రామ్ చరణ్ స్పందించడానికి కారణం, బయటున్న అభిమానులపై లాఠీచార్జ్ జరగడమేనని తెలుస్తోంది.