తమన్నాతోడేటింగ్ కు రడీ

0
9
తమన్నాతోడేటింగ్ కు రడీ

మిల్కీ బ్యూటీ తమన్నా ఎవరితో డేటింగ్ కు వెళ్తారు అనగానే ఒక్క క్షణం ఆగకుండా కౌశల్ పేరు చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. బాహుబలి తర్వాత అవకాశాలు లేకుండా ఉన్న తమన్నా…తాజాగా ఎఫ్ 2 తో భారీ హిట్ కొట్టి మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈ సినిమా తర్వాత తమన్నా కు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాదానాలు తెలిపింది.

మీరు కనుక డేట్ కు వెళ్ళాలనుకుంటే ఏ హీరోతో వెళ్తారు?” అని అడుగగా..ఒక్క క్షణం ఆగకుండా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ పేరు చెప్పింది. ‘సంజు’ సినిమాలో రణబీర్ ఫ్రెండ్ పాత్రలో నటించి అందరినీ ఆకట్టుకున్న విక్కీ ఆ సినిమా తర్వాత ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాలో హీరోగా నటించి అందర్నీ ఆకట్టుకున్నాడు. అలాగే తమన్నా మనసు కూడా గెల్చుకున్నాడు.