రైస్‌ ఖీర్‌

0
4
రైస్‌ ఖీర్‌
కావలసినవి
  • పాలు – ఐదు కప్పులు,
  • బియ్యం- పావుకప్పు,
  • పంచదార – అరకప్పు,
  • ఎండుద్రాక్ష – పది,
  • యాలకులు – నాలుగు,
  • బాదం – పది పలుకులు.
 
తయారీవిధానం
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి పక్కన పెట్టాలి. ఒక పాత్రలో పాలు తీసుకొని వేడి చేయాలి. పాలు మరుగుతున్న సమయంలో బియ్యం వేసి ఉడికించాలి. బియ్యం ఉడికి మిశ్రమం చిక్కగా అవుతున్న సమయంలో పంచదార, ఎండుద్రాక్ష, యాలకులు వేయాలి. పంచదార కరిగిన తరువాత మిశ్రమాన్ని మరొక పాత్రలోకి మార్చుకోవాలి. బాదం పలుకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.