విరాట్ కోహ్లీ, ధోనీ రికార్డులను బద్దలుగొట్టిన రోహిత్‌శర్మ……….

0
1
విరాట్ కోహ్లీ, ధోనీ రికార్డులను బద్దలుగొట్టిన రోహిత్‌శర్మ……….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • బంగ్లాదేశ్‌తో బరిలోకి దిగుతూనే ధోనీ రికార్డు బద్దలు
  • అత్యధిక టీ20లు ఆడిన ఆటగాడిగా రికార్డు
  • కోహ్లీ అత్యధిక పరుగుల రికార్డును అధిగమించిన రోహిత్

టీమిండియా స్టాండ్ ఇన్ కెప్టెన్ రోహిత్‌శర్మ రెండు రికార్డులు బద్దలుగొట్టాడు. ఆదివారం రాత్రి ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో బరిలోకి దిగుతూనే మాజీ సారథి ధోనీ అత్యధిక టీ20ల రికార్డును బద్దలుగొట్టాడు. ధోనీ ఇప్పటి వరకు 98 టీ20లు ఆడగా, 99 టీ20లతో రోహిత్ అతడిని అధిగమించాడు.ఇక, టీ20లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గానూ రోహిత్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీని వెనక్కి నెట్టేశాడు. నిన్నటి మ్యాచ్‌లో 9 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ ఖాతాలో 2452 పరుగులు చేరాయి. దీంతో 2450 పరుగులతో ఈ జాబితాలో ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న కోహ్లీ రికార్డు బద్దలైంది. వీరిద్దరి తర్వాతి స్థానంలో మార్టిన్ గప్టిల్ (2326), షోయబ్ మాలిక్ (2263), బ్రెండన్ మెకల్లమ్ (2140) ఉన్నారు.