‘కోమాలి’లో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉంటుంది…….

0
5
‘కోమాలి’లో రొమాన్స్ డోస్ ఎక్కువగా ఉంటుంది…….

(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • జయం రవి హీరోగా ‘కోమాలి’
  • నాయికలుగా కాజల్ – సంయుక్తా హెగ్డే 
  • ఆగస్టు 15వ తేదీన విడుదల

                      వివరాల్లోకి వెళితే…తమిళంలో ‘జయం’ రవి – కాజల్ జంటగా చేసిన ‘కోమాలి’ ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మరో నాయికగా సంయుక్తా హెగ్డే నటించింది. తాజాగా ఈ సినిమాను గురించి ‘జయం’ రవి మాట్లాడాడు. “ఇంతవరకూ నేను చేసిన సినిమాలకు భిన్నంగా ‘కోమాలి’ ఉంటుంది. కథాపరంగా రొమాన్స్ పాళ్లు ఎక్కువగానే ఉంటాయి. రొమాన్స్ తో పాటు కామెడీ .. సెంటిమెంట్ కలిసిపోయి కనిపించే కథ ఇది. రొమాన్స్ .. కామెడీ .. సెంటిమెంట్ .. ఈ మూడూ కూడా వేటికవే హైలైట్ గా అనిపిస్తాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం వుంది. గతంలో కాజల్ తో కలిసి నటించే అవకాశం రెండుసార్లు వచ్చింది. చివరి నిమిషంలో ఆ అవకాశం చేజారిపోయింది. ఆమెతో కలిసి నటించాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరినందుకు ఆనందంగా వుంది” అని చెప్పుకొచ్చాడు.