ఫ్రాడ్ కేసులో రాన్ బాక్సీ సింగ్ సోదరుల అరెస్ట్

0
8
ఫ్రాడ్ కేసులో రాన్ బాక్సీ సింగ్ సోదరుల అరెస్ట్

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • శివీందర్ సింగ్, మల్వీందర్ సింగ్ అరెస్ట్
  • డైచీని మోసం చేసిన కేసులో అదపులోకి తీసుకున్న పోలీసులు
  • మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ

                                                   వివరాల్లోకి వెళితే…ఫార్మా దిగ్గజం రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు శివీందర్ సింగ్, అతని సోదరుడు మల్వీందర్ సింగ్ లను ఫ్రాడ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 740 కోట్ల ఫ్రాడ్ కేసులో పంజాబ్ లోని లుధియానాలో నిన్న సాయంత్రం శివీందర్ సింగ్ ను, ఈ ఉదయం మల్వీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. గత ఆగస్టులోనే వీరిపై ఈడీ దాడులు జరిగాయి. తమను రూ. 740 కోట్ల మేర మోసం చేశారంటూ రెలిగేర్ ఫిన్ వెస్ట్ వారిపై గత డిసెంబర్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది జరిగిన ఐదు నెలల తర్వాత ఈ సోదరులపై చీటింగ్, ఫ్రాడ్, నిధుల దుర్వినియోగం తదితర ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో, వీరిపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది.