సగ్గుబియ్యం దోశ…

0
13
సగ్గుబియ్యం దోశ…
కావల్సినవి:
సగ్గుబియ్యం – కప్పు (కప్పు నీటిలో రెండు గంటలముందు నానబెట్టుకోవాలి)
సెనగపిండి – అరకప్పు
బియ్యప్పిండి – అరకప్పు
ఉప్పు – తగినంత
సన్నగా తరిగిన అల్లం ముక్కలు – కొన్ని
ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు
పచ్చిమిర్చి – మూడు
జీలకర్ర – చెంచా
కొత్తిమీర తరుగు – కొద్దిగా
నూనె – అరకప్పు.
తయారీ:సగ్గుబియ్యంలోని నీళ్లు వంపేయకుండానే సెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. పెనంపై మరీ పలుచగా కాకుండా కాస్త మందంగానే దోశ వేసి పైన ఉల్లిపాయ, అల్లంముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర చల్లాలి. చుట్టూ నూనె వేసి మూతపెట్టేయాలి. ఐదు నిమిషాలకు ఇది కాలుతుంది. ఈ దోశ మెత్తగానే ఉంటుంది. దీన్ని కొబ్బరిచట్నీతో కలిపి తీసుకోవచ్చు.
                                                                                                                   డెస్క్:వసుధ