స్విస్ ఓపెన్ లో సైనా విజృంభన …..

0
7
స్విస్ ఓపెన్ లో సైనా విజృంభన …..

బాసెల్‌ న్యూస్‌టుడే:

  • నేటినుంచి స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌

ఆలింగ్లాండ్ చాంపియన్‌షిప్‌లో పరాజయాలను విస్మరించి మం గళవారం ఆరంభం కానున్న స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, సమీర్‌ వర్మ సత్తా ప్రదర్శించేందుకు సంసిద్ధమ య్యారు. తొలి రౌండ్‌లో ఇరువురూ క్వాలిఫైయర్లను ఎదుర్కోనున్నారు. సైనా గతంలో రెండుసార్లు ఇక్కడ టైటిల్‌ సాధించగా, సమీర్‌వర్మ నిరుడు విజేతగా నిలిచాడు.
అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతూ కెరీర్‌లో అత్యుత్తమంగా 11వ ర్యాంక్‌ సాధించింది సమీర్‌ ఈ టైటిల్‌ విజయంతోనే. గత ఏడాది క్వార్టర్‌ఫైనల్లో ప్రస్తుత ఆలింగ్లండ్‌ చాంపియన్‌ కెంటొ మొమొటొను ఓడించి పరిశీలకులను విస్మయపరిచిన సమీర్‌ రెండో రౌండ్‌లో భారత్‌కు చెందిన సాయిప్రణీత్‌ను ఎదుర్కొనే అవకాశముంది. ఇంకా ముందుకు సాగితే మాజీ నంబర్‌ వన్‌ విక్టర్‌ అలెక్సన్‌తో తలపడతాడు. కాగా సమీర్‌ సోదరుడు, సీనియర్‌ జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ గాయాలకారణంగా టోర్నీనుంచి తప్పుకున్నాడు.