క్వార్టర్‌ఫైనల్ లోకి సైనా ఎంట్రీ…..

0
8
క్వార్టర్‌ఫైనల్ లోకి  సైనా ఎంట్రీ…..

భారత స్టార్‌ షట్లర్‌ మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్‌, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్‌ ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరారు. టోర్నీ రెండో రోజు గురువారం, సైనా ప్రీక్వార్టర్స్‌ పోటీలో డెన్మార్క్‌కు చెందిన లినే హొజ్‌మార్క్‌ కెజార్స్‌ఫెల్ట్‌ను 8-21, 21-16, 21-13 తేడాతో ఓడిం చింది. 2015లో రన్నరప్‌గా నిలిచిన ఎనిమిదో సీడెడ్‌ సైనా 51 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్‌ నెంబర్‌ 19 క్రీడాకారిణి లినేపై అద్భుతమైన షాట్లతో విరుచు కుపడింది. అయితే తొలి గేమ్‌లో సైనా 8 పాయింట్ల వద్దే ఆగిపోయింది. 24 ఏళ్ల లినే ర్యాలీగా కొనసాగుతూ 21-8 తో గేమ్‌ను సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో పుంజుకున్న సైనా దూకుడుగా ఆడుతూ శక్తివంతమైన షాట్లతో ముందుకు సాగుతూ.. 21-16 తేడాతో గేమ్‌ను గెలుచుకుంది. కీలకమైన మూడో గేమ్‌లో సైనా మరింత రెచ్చిపోయింది. 21-13 పాయింట్ల తేడాతో ప్రత్యర్థి లినేను ఖంగుతినిపించి గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్లో సైనా తన చిరకాల ప్రత్యర్థి చైనీస్‌ తాపైకు చెందిన తాయ్‌ జు యింగ్‌ను ఢీకొనే అవకాశముంది. తాయ్‌ జు చేతిలో సైనా వరుసగా 12సార్లు పరాజయం పాలైంది. వీరిద్దరు పరస్పరం 19సార్లు తలపడగా, తాయ్‌జు 14 సార్లు గెలిచింది. సైనా 5సార్లు మాత్రమే విజయం సాధించింది. కాగా సైనా ఈ టోర్నీలో భాగంగా బుధవారం ఆడిన తొలి రౌండ్లో స్కాట్‌లాండ్‌కు చెందిన క్రిస్టీ గిల్‌మోర్‌ను 21-17, 21-18 తేడాతో ఓడించింది. 35 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో సైనా పోరాడి గెలిచింది.