సైనాకు తప్పని ఓటమి …

0
8
సైనాకు తప్పని ఓటమి …

బర్మింగ్‌హామ్‌ న్యూస్‌టుడే:

  • క్వార్టర్‌ ఫైనల్లో 15-21, 19-21 తేడాతో పరాజయం
  • ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీ

ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ సైనా నెహ్వాల్‌ తన చిరకాల ప్రత్యర్థి వరల్డ్‌ నెంబర్‌ వన్‌ తాయ్‌ జు యింగ్‌ ముందు మరోసారి చేతులెత్తేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ పోరులో సైనా చైనీస్‌ తాపైకు చెందిన తాయ్‌ జు యింగ్‌ చేతిలో 15-21, 19-21 తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. తాయ్‌జు కొట్టిన షాట్లకు సైనా వద్ద బదులు లేకపోయింది. 37 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌ తొలి గేమ్‌లో తాయ్‌ జు దూకుడుగా ఆడుతూ.. 11-3తో లీడ్‌ను పొందింది. అనంతరం సైనా పుంజుకుని తర్వాతి 12 పాయింట్లలో 9 పొంది తాయ్‌ జు లీడ్‌ను 12-14కు తగ్గించింది. తాయ్‌జు అద్భుతమైన షాట్లతో సైనాను ఉక్కిరిబిక్కిరి చేస్తూ 20-13కు పెరిగింది. అనంతరం మరో రెండు పాయింట్లు పొందిన సైనా అక్కడే ఆగిపోగా మరోపాయింట్‌ను పొంది తాయ్‌జు గేమ్‌ను గెలిచింది. రెండో గేమ్‌ ప్రారంభంలో సైనా 8-3తో లీడ్‌ను పొందింది. మరోవైపు ఆమె కోచ్‌ భర్త కశ్యప్‌ క్రమశిక్షణతో గేమ్‌ ఆడాలని సూచించాడు. అదే జోరుతో సైనా 11-8కు చేరుకుంది. అయితే మళ్లిd తాయ్‌జు పుంజుకుని 17-15 ఆధిక్యాన్ని సాధించింది. అనంతరం సైనా స్కోరును 19-19తో సమం చేసింది. అనంతరం తాయ్‌జు కొట్టిన షాట్లకు బదులిస్తూ.. సైనా కొట్టిన షాట్లు కోర్టు లైన్‌ ఆవల పడటంతో తాయ్‌జు గేమ్‌తో పాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్‌కు ముందు సైనా డయేరియాకు లోను కావడం ఆమె ఆటపై ప్రభావం చూపిందని విశ్లేషకులంటున్నారు. తాయ్‌జుతో ఆడుతూ సైనాకు ఇది వరుసగా 13వ ఓటమి. ఇప్పటివరకు వీరిద్దరు పరస్పరం ఆడిన 20 మ్యాచుల్లో తాయ్‌ జు 15 గెలువగా, సైనా 5మ్యాచులను దక్కించుకుంది.