ప్రభాస్ కి ఫస్టు టికెట్ అందజేసిన సందీప్ కిషన్……….

0
3
ప్రభాస్ కి ఫస్టు టికెట్ అందజేసిన సందీప్ కిషన్……….

(టిన్యూస్10):న్యూస్‌టుడే…

  • విభిన్నమైన కథాంశంతో ‘నిను వీడని నీడను నేనే’
  • రేపు భారీస్థాయిలో విడుదల 
  • ఎన్నో ఆశలు పెట్టుకున్న సందీప్ కిషన్

                       వివరాల్లోకి వెళితే… సందీప్ కిషన్ కథానాయకుడిగా ‘నిను వీడని నీడను నేనే’ సినిమా నిర్మితమైంది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్నరాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా నిఖిల్ – సుధీర్ బాబు, అతిథులుగా కార్తికేయ – విష్వక్సేన్ హాజరయ్యారు. ఈ సినిమా సెకండ్ టికెట్ ను వాళ్లకి సందీప్ కిషన్ అందజేశాడు. ఫస్టు టికెట్ ఏ హీరోకి ఇవ్వనున్నది ‘గురువారం’ చెబుతానని అన్నాడు. దాంతో అందరిలో ఆసక్తి నెలకొంది. కొంతసేపటి క్రితం సందీప్ కిషన్ తన సినిమా ఫస్టు టికెట్ ను ప్రభాస్ కి అందజేశాడు. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శితం కానున్న ఈ సినిమా టికెట్ ను ప్రభాస్ కి అందజేస్తూ దిగిన ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ఈ సినిమాతోనైనా సందీప్ కిషన్ హిట్ కొడతాడేమో చూడాలి.