జమ్మూకశ్మీర్ లో 144 సెక్షన్ ఎత్తివేత!

0
1
జమ్మూకశ్మీర్ లో 144 సెక్షన్ ఎత్తివేత!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో కశ్మీర్ లోయలో 144 సెక్షన్ విధింపు
  • కశ్మీర్ వ్యాప్తంగా ప్రశాంత జనజీవనం
  • రేపు తెరుచుకోనున్న స్కూళ్లు, పాఠశాలలు

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా విధించిన 144 సెక్షన్ ను ఈ సాయంత్రం ఎత్తివేశారు. జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో పాటు, రాష్ట్ర విభజన చేయడంతో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటాయని భావించి 144 సెక్షన్ విధించారు. అయితే, కశ్మీర్ లోయలో చాలావరకు సాధారణ ప్రశాంత జీవనం దర్శనమివ్వడంతో ఆంక్షలను సడలించారు. కాలేజీలు, పాఠశాలలు రేపు తెరుచుకోనున్నాయి. క్రమంగా జమ్మూకశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని కేంద్రం భావిస్తోంది. అందుకే త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ ప్రధాని మోదీ కూడా తెలిపారు.