ఆ విషయం సెలక్టర్లు ధోనీకి చెప్పాలి…

0
3
ఆ విషయం సెలక్టర్లు ధోనీకి చెప్పాలి…

 (టిన్యూస్10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…..

  • ‘‘సెహ్వాగ్‌తో మాట్లాడే బాధ్యతను విక్రమ్‌ రాఠోడ్‌కు ….   

                          వివరాల్లోకి వెళితే…. ధోనీని వద్దనుకుంటే సెలక్షన్‌ కమిటీ ఆ విషయాన్ని అతడికి చెప్పాలని మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. ‘‘ధోని ఎప్పుడు రిటైర్‌ కావాలన్నది అతడి ఇష్టం. ఆ విషయాన్ని అతడికే వదిలేయాలి. ధోనీతో మాట్లాడడం, ‘నిన్ను భారత జట్టు వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మన్‌గా కొనసాగించాలనుకోవట్లేదు’ అని చెప్పడం సెలక్టర్ల బాధ్యత. నా విషయంలో అలా జరిగి ఉంటే బాగుండేది’’ అని ఓ ఛానెల్‌లో చర్చ సందర్భంగా చెప్పాడు. ఈ చర్చలో సందీప్‌ పాటిల్‌ కూడా పాల్గొన్నాడు. 2013లో సెహ్వాగ్‌ను జట్టు నుంచి తప్పించినప్పుడు పాటిలే సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌. వీరూ వ్యాఖ్యలతో ఇబ్బందిపడ్డ పాటిల్‌.. వెంటనే అతడికి క్షమాపణలు చెప్పాడు. ‘‘సెహ్వాగ్‌తో మాట్లాడే బాధ్యతను విక్రమ్‌ రాఠోడ్‌కు అప్పగించాం. మాట్లాడానని అతడు చెప్పాడు. కానీ విక్రమ్‌ తనతో మాట్లాడలేదని సెహ్వాగ్‌ ఇప్పుడు చెబుతున్నాడు. జరిగినదానికి బాధ్యత తీసుకుంటున్నా’’ అని పాటిల్‌ అన్నాడు. జట్టు నుంచి తప్పించాక విక్రమ్‌ తనతో మాట్లాడాడని, తప్పించాక మాట్లాడడంలో అర్థం లేదని సెహ్వాగ్‌ చెప్పాడు. ఈ చర్చలో పాల్గొన్న మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌.. సెహ్వాగ్‌తో విభేదించాడు. ‘‘ఎంపిక చేసేటప్పుడు ఆటగాడితో సెలక్టర్‌ మాట్లాడనప్పుడు.. తప్పించేటప్పుడు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు’’ అని అన్నాడు.