యూఎస్ ఓపెన్ లో సంచలనం… ఫెదరర్ ఓటమి!

0
2
యూఎస్ ఓపెన్ లో సంచలనం… ఫెదరర్ ఓటమి!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……..

  • అన్ సీడెడ్ దిమిత్రోవ్ చేతిలో ఓటమి
  • ఐదు సెట్లు సాగిన పోరు
  • ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్ లో 78వ స్థానంలో దిమిత్రోవ్

యూఎస్ లో జరుగుతున్న గ్రాండ్ స్లామ్ టెన్నిస్ పోటీల్లో సంచలనం నమోదైంది. స్విస్ స్టార్, మూడవ సీడ్ రోజర్ ఫెదరర్ ను క్వార్టర్ ఫైనల్స్ లో భాగంగా జరిగిన పోరులో అన్ సీడెడ్ గా బరిలోకి దిగిన దిమిత్రోవ్ ఇంటికి పంపాడు. ఆర్థర్ ఆష్ స్టేడియంలో సుదీర్ఘంగా సాగిన మ్యాచ్ లో 6-3, 4-6, 6-3, 4-6, 2-6 తేదాడో దిమిత్రోవ్ చేతిలో ఫెదరర్ ఓటమి పాలయ్యారు. ఇప్పటివరకూ వీరిద్దరి మధ్యా ఎనిమిది సార్లు టెన్నిస్ పోరు జరుగగా, ఏడు సార్లు ఫెదరరే విజయం సాధించారు. ఈ మ్యాచ్ లోనూ ఫెడ్ గెలుస్తాడని అందరూ భావించినా, అన్ని విభాగాల్లో ఆధిపత్యం చూపిన దిమిత్రోవ్ విజయం సాధించాడు. కాగా, ప్రస్తుతం ఏటీపీ ర్యాంకింగ్స్ లో దిమిత్రోవ్ 78వ స్థానంలో ఉండటం గమనార్హం.