సిరీస్ కివీస్ దే…

0
5
సిరీస్ కివీస్ దే…
  • చివరి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో గెలుపు
  • పోరాడి ఓడిన రోహిత్‌ సేన
  • న్యూజిలాండ్‌ 212/4, భారత్‌ 208/6

న్యూజిలాండ్‌ గడ్డపై టీ20 సిరీస్‌ను తొలిసారిగా గెలవాలన్న భారత్‌ కాంక్ష విఫలమైంది. ఆదివారం జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ సేన పోరాడి ఓడింది. నాలు గు పరుగుల స్వల్ప తేడాతో న్యూజిలాండ్‌ చేతిలో పరాజయం పాలై మూడు మ్యాచుల సిరీస్‌ను 2-1తో కోల్పోయింది. అంతకు ముందు న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ను భారీ తేడాతో కైవసం చేసుకుని రికార్డు సృష్టించిన భారత్‌ టీ20 సిరీస్‌లో కళ్లు తెలెసింది. తొలి టీ20లో 80 పరుగుల తేడాతో ఓడిన భారత్‌ రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించి 1-1తో సమానం చేసింది తాజాగా మూడో టీ20లో లక్ష్య ఛేదనలో భారత్‌ విఫలమై 4 పరుగుల తేడాతో ఓడింది. న్యూజిలాండ్‌ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో రోహిత్‌ సేన విఫలమైంది. ఓపెనర్లు రోహిత్‌, శిఖర్‌ ధావన్‌లు ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here