చుక్కకూర నువ్వుల పచ్చడి ………..

0
1
చుక్కకూర నువ్వుల పచ్చడి ………..

కావల్సినవి:

 • చుక్కకూర- రెండుకట్టలు
 • నువ్వులు-మూడుచెంచాలు
 • ఉల్లి పాయలు-రెండు
 • పచ్చిమిర్చి-ఆరు
 • నూనె- ఐదు చెంచాలు,  
 • వెల్లుల్లిపాయలు-పది,
 • జీలకర్ర-రెండుచెంచాలు
 • ఆవాలు-చెంచా
 • ఎండుమిర్చి-మూడు
 • కరివేపాకు రెమ్మలు-రెండు
 • ఉప్పు తగినంత

తయారీవిధానం: 
బాణలి వేడి చేసి మూడుచెంచాల నూనె వేసి అందులోచెంచా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, వేయించాలి. ఐదునిమిషాలయ్యాక శుభ్రంగా కడిగిన చుక్కకూర, వెల్లుల్లిపాయలు చేర్చాలి. ఆకుల్లోని తేమ పూర్తిగా తొలగిపోయేదాకా వేయించాలి. ఇప్పుడు మిక్సీలో నువ్వులు పొడిచేసి ఆ తరవాత వేయించి పెట్టుకున్న చుక్కకూర, తగినంత ఉప్పు వేసి మిక్సీపట్టాలి.మిగిలిన నూనె వేడిచేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలతో తాలింపు పెట్టి.. పచ్చడిలో కలిపితే చాలు. నోరూరించే చుక్కకూర పచ్చడి సిద్ధం.