నా నెక్స్ట్ మూవీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది: యాంకర్ అనసూయ

0
6
నా నెక్స్ట్ మూవీ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేస్తుంది: యాంకర్ అనసూయ

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….

  • నిరాశ పరిచిన ‘కథనం’
  • కొత్త కథకి ఓకే చెప్పానన్న అనసూయ 
  • సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి  

                           వివరాల్లోకి వెళితే…ఇటు బుల్లితెరపై .. అటు వెండితెరపై అనసూయకి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక వైపున ముఖ్యమైన పాత్రలకి ఓకే చెబుతూనే, మరో వైపున నాయిక ప్రాధాన్యత కలిగిన కథలకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వెళుతోంది. అలా ఇటీవల ఆమె చేసిన ‘కథనం’ సినిమా ఆదరణ పొందలేదు.  అయితే ఈ సారి తను చేయనున్న సినిమా మాత్రం ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేస్తుందని అనసూయ చెప్పింది. తను ఓకే చెప్పిన కథ ఎంతో విభిన్నంగా ఉంటుందనీ, తన పాత్ర చాలా విలక్షణంగా ఉంటుందని అంది. సెప్టెంబర్ మొదటివారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందనీ, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని అంది. ‘కథనం’తో అభిమానులను నిరాశ పరిచిన అనసూయ, తాజాగా ఈ ప్రకటనతో అందరిలోను ఆసక్తిని పెంచేసింది.