శోభన్ బాబు గారు టైమ్ అంటే టైమే: సీనియర్ హీరోయిన్ రాజశ్రీ

0
0
శోభన్ బాబు గారు టైమ్ అంటే టైమే: సీనియర్ హీరోయిన్ రాజశ్రీ

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • మంచి మనసున్న మనిషి శోభన్ బాబు 
  •  సమయపాలనలో కచ్చితంగా ఉండేవారు
  • గ్లామర్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టేవారన్న రాజశ్రీ

                                        వివరాల్లోకి వెళితే…ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కాంతారావులతో పాటు శోభన్ బాబుతోను కలిసి రాజశ్రీ నటించారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ శోభన్ బాబును గురించి ప్రస్తావించారు. “శోభన్ బాబుగారితో కలిసి నేను నాలుగైదు సినిమాలు చేశాను. కలిసి చేసిన సినిమాలు తక్కువే అయినా మా మధ్య సాన్నిహిత్యం ఎక్కువ. అప్పట్లో పక్క పక్కనే సెట్లలో షూటింగ్ జరుగుతుంటే, విరామ సమయంలో కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్లం. అలా అంతా ఒక కుటుంబం అనే ఫీలింగ్ ఉండేది. శోభన్ బాబుగారు ఒక పద్ధతి గల మనిషి .. మంచి మనసున్న మనిషి. సమయపాలనకి ఆయన ఎక్కువ విలువనిచ్చేవారు. అలాగే తన గ్లామర్ విషయంలోను ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు. రాత్రివేళ షూటింగ్స్ ఒప్పుకునేవారు కాదు .. అప్పట్లో రాత్రి 9 దాటితే ఒక్క నిమిషం కూడా సెట్లో ఉండేవారు కాదు. ‘ఒక్క షాట్ వుంది సార్ .. వెంటనే అయిపోతుంది’ అని ఎవరు రిక్వెస్ట్ చేసినా ఆగేవారు కాదు. రాత్రివేళలో మెలకువతో వుండి షూటింగ్ చేస్తే, మరుసటి రోజు కెమెరాలో లుక్ ‘డల్’గా కనిపిస్తుందని ఆయన భావించేవారు” అని చెప్పుకొచ్చారు.