సీబీఎన్ ఆర్మీపై వైసీపీ కార్యకర్తల దాడి.. నలుగురికి గాయాలు

0
8
సీబీఎన్ ఆర్మీపై వైసీపీ కార్యకర్తల దాడి.. నలుగురికి గాయాలు
చంద్రగిరి:న్యూస్‌టుడే:
*చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్తూరులో ఘటన…..
*బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు….
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్తత ఏర్పడింది. కొత్తూరు సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్న సీబీఎన్ ఆర్మీ సభ్యులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో నలుగురు యువకులకు గాయాలయ్యాయి. బాధితుల్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వారిలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన గురించి తెలియగానే.. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని బాధితుల్ని పరామర్శించారు. తమపై వైసీపీ కార్యకర్తలు బీరు బాటిళ్లతో 30మంది దాడి చేశారని సీబీఎన్ ఆర్మీ సభ్యులు ఆరోపించారు. దాడి చేసినవారంతా వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అనుచరులంటున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. నలుగురు వైసీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఓటమి భయంతోనే చెవిరెడ్డి దౌర్జన్యాలకు దిగుతున్నారని.. టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని, నేతలు మండిపడుతున్నారు.డెస్క్:దుర్గ