సీర్‌ ఫిష్‌….

0
2
సీర్‌ ఫిష్‌….
కావల్సినవి:
  • చేప ముక్కలు – నాలుగు,
  • అల్లం వెల్లుల్లి ముద్ద – రెండు చెంచాలు,
  • పసుపు – అరచెంచా,
  • కారం – రెండు చెంచాలు,
  • ధనియాలపొడి – చెంచా,
  • ఉప్పు – తగినంత,
  • జీలకర్రపొడి – అరచెంచా,
  • నూనె – వేయించేందుకు సరిపడా.
తయారీ: అల్లంవెల్లుల్లి ముద్ద, పసుపు, కారం, ధనియాలపొడి, ఉప్పు, జీలకర్రపొడి ఓ గిన్నెలోకి తీసుకుని బాగా కలపాలి. చేప ముక్కలకు ఈ మిశ్రమాన్ని పట్టించాలి. అరగంట తరవాత బాణలిలో నూనె వేడిచేసి చేపముక్కల్ని ఉంచి.. బాగా వేయించి తీసుకోవాలి.   
                                                                                                                  డెస్క్:వాసవి