సింగపూర్ నూడిల్స్……డెస్క్:దుర్గ

0
2
సింగపూర్ నూడిల్స్……డెస్క్:దుర్గ
  • కావలసిన పదార్థాలు:
  • నూడుల్స్‌- 2 కప్పులు
  • ఉల్లిపాయ- 1
  • మిరియాలు- పావు టీ స్పూను
  • బఠాణీలు- 1 టేబుల్‌ స్పూను
  • చిక్కుడుకాయలు- పది 
  • సోయాసాస్‌- ఒక టేబుల్‌ స్పూను
  • కర్రీపౌడర్‌- 3 టీ స్పూన్లు
  • కొకొనట్‌ షుగర్‌  ఒక టేబుల్‌ స్పూను
  • నిమ్మరసం, నూనె- 2 టేబుల్‌ స్పూన్లు
  • వెల్లుల్లి ముద్ద- 2 టీ స్పూన్లు
  • పనీర్‌ ముక్కలు- అర కప్పు
  • తరిగిన క్యాప్సికమ్‌ – ఒకటి
  • ఉల్లికాడలు- కొద్దిగా
  • ఉప్పు, కారం- తగినంత.
     
    తయారీ విధానం: నూడుల్స్‌ను వేడినీటిలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టాలి. ఒక గిన్నెలో సోయాసాస్‌, వెల్లుల్లి ముద్ద, కొకొనట్‌ షుగర్‌, నిమ్మరసం వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు,   బఠాణీలు, సోయాసాస్‌ మిశ్రమం, సగం కర్రీపౌడర్‌ కూడా వేసి  వేగించి దించి పక్కన పెట్టుకోవాలి. మరో బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక నూడుల్స్‌ వేసి మిగిలిన సగం కర్రీపౌడర్‌ వేసి నిమిషం పాటు వేగించాలి.  మిగిలిన పదార్థాలన్నిటినీ వేసి మరో 5 నిమిషాలు వేగించి దించేయాలి.