సినిమా షూటింగ్‌లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారితో సహా తల్లి మృతి…

0
10
సినిమా షూటింగ్‌లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారితో సహా తల్లి మృతి…
న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు….
*సినిమా షూటింగ్‌లో ప్రమాదవశాత్తు పేలిపోయిన గ్యాస్ సిలిండర్….
*షూటింగ్ చూడటానికి వచ్చిన మహిళతోసహా ఆమె కుమార్తె దుర్మరణం….
బెంగళూరు సమీపంలో ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో తల్లీబిడ్డలు మృతి చెందారు. శాండిల్‌వుడ్ నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న ‘రణం’ సినిమా చిత్రీకరణలో ఈ విషాదం జరిగింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెంగళూరులోని బాగలూరు వద్ద సినిమా చిత్రీకరణ జరుగుతుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో అక్కడకు వచ్చిన ఓ మహిళ ఆమె ఐదేళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్‌లో భాగంగా కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో షూటింగ్ చూసేందుకు వచ్చిన సుమనా భాను (28), ఆమె ఐదేళ్ల పాప అయిషా ఖాన్ (5) ప్రాణాలు కోల్పోగా, ఆమె పెద్ద కుమార్తె జైనాబ్ (7) తీవ్రంగా గాయపడింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కేఐఏబీడీ హార్డ్‌వేర్ పార్క్ సమీపంలో చోటచేసుకున్న ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
                                                                                                                  డెస్క్:దుర్గ