వేర్వేరు ఘటనలలో ఒకేరాత్రి ఆరు హత్యలు!

0
2
వేర్వేరు ఘటనలలో ఒకేరాత్రి ఆరు హత్యలు!

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు….

  • చెన్నై పరిసరాల్లో వేర్వేరు కారణాలతో ఆరుగురు వ్యక్తుల హత్య
  • నిందితుల కోసం పోలీసుల వేట
  • భయపడుతున్న నగర వాసులు

చెన్నైలో సోమవారం రాత్రి ఆరుగురు హత్యకు గురికావడం సంచలనమైంది. ఏం జరుగుతోందో తెలియక జనాలు భయంతో వణికిపోతున్నారు. నగర శివారులోని వేళచ్చేరి సమీపంలోని పెరుంబాక్కం ఇందిరానగర్‌కు చెందిన ఆనంద్‌(29), స్టీఫెన్‌(23)లు మద్యం తాగేందుకు  సమీపంలోని టాస్మాక్‌ మద్యం దుకాణానికి వెళ్లారు. అక్కడ ఫుల్లుగా మందుకొట్టి వస్తుండగా మూడు బైక్‌లపై వచ్చిన ఆరుగురితో వీరికి వాగ్వివాదం జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన ఆ ఆరుగురూ ఆనంద్, స్టీఫెన్‌లను కిరాతకంగా నరికి చంపారు. గతవారం ఆలయ ఉత్సవాల సందర్భంగా జరిగిన గొడవే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.మరో ఘటన కిట్టాలాచ్చి నగర్‌లో జరిగింది. రంజిత్ కుమార్, శుభా దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. శుభ ఓ ఆటో డ్రైవర్‌తో వివాహేతర సంబంధ పెట్టుకుని ఇంటి నుంచి ఉడాయించగా, రంజిత్ కుమార్.. గోమతి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రంజిత్‌కుమార్, గోమతి గదిలో ఉన్న సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన నలుగురు దుండగులు అతడిని దారుణంగా నరికి చంపారు. ఈ దాడి నుంచి గోమతి తప్పించుకుంది.