సమాజంలో మార్పు తీసుకువస్తాం..

0
4
సమాజంలో మార్పు తీసుకువస్తాం..

నెల్లూరు న్యూస్‌టుడే: ఓటు వేసిన వారికే నాయకులను నిలదీసే హక్కు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరులో విద్యార్థులతో పవన్ కల్యాణ్ ఇష్టాగోష్టిగా భేటీ అయ్యారు. ఈసందర్భంగా పవన్ మాట్లాడుతూ… కచ్చితంగా సమాజంలో మార్పు తీసుకువస్తానన్నారు. రాజకీయాలు రెండు కుటుంబాలకే పరిమితమైపోయాయన్నారు.  ఇప్పటికైనా కొత్త వ్యక్తులకు అవకాశం ఇద్దామన్నారు. తొలిసారి ఓటుహక్కు వినియోగించుకునే వారి ప్రభావం 12పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఉంటుందన్నారు. జనసేన ద్వారా నా వంతు కృషి నేను చేస్తున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.

                                                                                               డెస్క్:విధుల&ఖాన్