తయారీకి కావాల్సినవి :
- సోయాకూర తరుగు – కప్పు
- తొక్కు తీసి శుభ్రం చేసిన రోయ్యలు – కప్పు
- ఉల్లి ముక్కలు – అర కప్పు
- పచ్చిమిర్చి – మూడు
- అల్లం ,వెల్లుల్లి పేస్ట్ – కొద్దిగా
- లవంగాల పోడి – 1స్పూన్
- ఉప్పు- తగినంత
- కారం – తగినంత
- జీలకర్ర పోడి – అర స్పూన్
- బియ్యపిండి – 2స్పూన్స్
- కొత్తిమీర తరుగు – కొద్దిగా,కరివేపాకు రెమ్మలు – కోన్ని
- నూనె – తగినంత.
తయారీ విధానం : ముందుగా నూనె వేసి వెడిచేసి దానిలో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు , కరివెపాకు వేసి వేగించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా వేగనివ్వాలి. తరువాత లవంగాల పోడి, సోయకూర, ఉప్పు,కారం, జీలకర్ర పోడి కొంచేంసేపు ఉంచి తరువాత ర్య్యలు వేసి తిప్పుతూ 2 మినిట్స్ వేయించాలి. బియ్యపిండి కలిపిన నీల్లను పోసుకోవాలి. దగ్గరగా వచ్చిన తరువాత దించుకోని కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి. దినిని రోటిస్ లో కూడా తినవచ్చు. డెస్క్… లక్ష్మీ