18, 19 తేదీల్లో ప్రత్యేకంగా శాసనసభ భేటి…………

0
4
18, 19 తేదీల్లో ప్రత్యేకంగా శాసనసభ భేటి…………

 (టిన్యూస్10) న్యూస్‌టుడే: ముఖ్యాంశాలు…..  

  • ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలి….
  • ఏడో తేదీకి వార్డుల పునర్విభజన పూర్తి …
  • ఈనెల 14వ తేదీ నాటికి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి… 

                    వివరాల్లోకి వెళితే…..సిఎం కెసిఆర్‌ గురువారం ప్రగతిభవన్‌లో పురపాలక ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో పురపాలక ఎన్నికలను కొత్త చట్టంతోనే నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేకంగా సమావేశమై కొత్త పురపాలక బిల్లును ఆమోదించనుంది. గతంలో ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఎన్నికల ప్రకటన ఇచ్చి ఈ నెలాఖరుకు ఎన్నికలు నిర్వహించేలా ఏర్పాట్లను చేసిన ప్రభుత్వం తాజాగా కొత్త చట్టం తర్వాతే పుర పోరు జరిపేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. బిల్లు ముసాయిదాను న్యాయశాఖ పరిశీలనకు పంపారు. ఆ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని మార్పులు చేర్పులతో తుది బిల్లును రూపొందించనుంది. శాసనసభ, శాసనమండలిలో దీన్ని ఆమోదించాక కొత్త చట్టాన్ని అమలులోకి తేనుంది. ఏడో తేదీకి వార్డుల పునర్విభజన పూర్తి చేయగా ఈనెల 14వ తేదీ నాటికి ఓటర్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి కానుంది.