శ్రీ దత్తాత్రేయ వ్రతం…..

0
3
శ్రీ దత్తాత్రేయ వ్రతం…..

శ్రీ దత్తాత్రేయ వ్రతం ఎంతో శక్తిమంతమైనది … మరెంతో మహిమాన్వితమైనది. అనసూయ – అత్రి మహర్షి దంపతుల ప్రార్ధన మేరకు ‘మార్గశిర శుద్ధ పౌర్ణమి’ రోజున త్రిమూర్తుల అంశతో శ్రీ దత్తాత్రేయ స్వామి జన్మించాడు. ఈ రోజున స్వామివారి వ్రతం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దత్తాత్రేయ స్వామి అవతరించిన ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి దత్తాత్రేయ స్వామికి పూజాభిషేకాలు నిర్వహించాలి. స్వామికి నైవేద్యంగా సమర్పించిన పాలు – పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం చేయాలి. గురుచరిత్రను పారాయణం చేస్తూ … దత్తానామాన్ని స్మరిస్తూ వుండాలి. సాయంత్రం కాగానే సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగానే మంటపంతో సహా దత్తాత్రేయ స్వామి పూజకు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. దత్తాత్రేయ స్వామిని పూజించి ఆ తరువాత వ్రతంలో భాగమైన అయిదు అధ్యాయాలుగల కథలు చదవాలి. శ్రీ దత్తాత్రేయ స్వామి మహిమలను … ఆయన అనుగ్రహాన్ని ఈ కథలు కళ్లకి కడతాయి. పూజ పూర్తికాగానే , గోధుమ పిండి … పంచదార .. ఆవునెయ్యి … యాలకుల పొడి … ఎండు ద్రాక్ష కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించి హారతి ఇవ్వాలి.