శ్రీ మాంగళ్య దేవి………

0
8
శ్రీ మాంగళ్య దేవి………

బీహార్ – గయ ప్రాంతంలో ‘మాంగళ్య దేవి’ శక్తి పీఠం ఆవిర్భవించింది. ఈ ప్రదేశానికి ‘గయ’ అనే పేరు రావడానికి కారణమైన కథగా గయాసురుడి వృతాంతమే వినిపిస్తుంది. ఇక్కడి అమ్మవారు మాంగళ్య గౌరీదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. బ్రహ్మదేవుడి కుమారుడైన మరీచి తన భార్య అయిన ధర్మవ్రతను శపించగా, ఆమె మాంగళ్య గౌరీదేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందినట్టుగా స్థల పురాణం చెబుతోంది. ఫల్గుణీ నదీ తీరంలో గల విష్ణుపాద క్షేత్రానికి పక్కనే ఈ మాంగళ్య గౌరీ దేవి ఆలయం ఉంది. ఇక ఇక్కడికి దగ్గరలోనే సిద్ధార్థుడికి జ్ఞానోదయం కలిగించి బుద్ధుడిగా మార్చిన ‘బోధి వృక్షం’ కూడా కనిపిస్తుంది. సాధారణంగా గయకి వచ్చే వారంతా పితృదేవతలకు ఆబ్దికాలు నిర్వహించే పనిపైనే దృష్టి పెడుతుండటం వలన, అమ్మవారి ఆలయం దగ్గర అంతగా రద్దీ కనిపించదు. గర్భాలయంలో తులసికోట పై ఆవునెయ్యితో అఖండ దీపం వెలుగుతూ ఉంటుంది. ఈ కారణంగానే అమ్మవారిని శ్రీ మహావిష్ణువు సోదరిగా భావించి భక్తులు కొలుస్తూ ఉంటారు.