శ్రీ స్కంద షష్టి…….శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు జన్మించిన పవిత్ర పర్వతం…

0
7
శ్రీ స్కంద షష్టి…….శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు జన్మించిన పవిత్ర పర్వతం…
శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు జన్మించిన పవిత్ర పర్వదినం… శ్రీ స్కంద షష్టి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్ల పక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవటం మన ఆచారం.
ఆరుముఖాలు… పన్నెండు భుజాలు… కలిగి నెమలి వాహనారూడుడై దివ్య తేజస్సుతో వెలుగొందుతున్న స్వామిని సేవిస్తే….భక్తులకు వంశాభివృద్ధిని బుద్ధి సమృద్దిని ప్రసాదిస్తాడు అంటారు. ఈ పర్వదినాన్ని సుబ్రహ్మణ్య షష్టి, సుబ్బరాయ షష్టి, కుమార షష్టి, కార్తికేయ షష్టి ,గుహప్రియ వ్రతం అని పేర్లు ఉన్నాయి. మరి సుబ్రహ్మణ్యస్వామి అవతారం వివరాలు తెలుసుకుందామా..? సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలనూ, మానవులనూ కూడా బాధిస్తున్నారట. శివపార్వతుల కుమారుడే వీరిని చంపగలడని  బ్రహ్మదేవుడు చెప్పారట. తన పూలబాణాలతో శివుని తపస్సుకి భంగము చేసి ప్రణయములోనికి దింపాలని  ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయిపోయాడట. శివుడి నుండి వెలువడిన తేజస్సు ఆరు భాగాలుగా విభజించబడిందట. వాటిని వాయువు అగ్ని దేవుళ్ళు గంగానదిలో ఉంచారట. అవి ప్రవాహంలో వెళ్ళి క వనం లో చిక్కుకుని  చక్కన బాలుళ్ళలా మారాయట. వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జోలపాడారట. విషయం తెలిసిన పార్వతీదేవి స్కందా అని పిలుస్తూ వారిని అక్కున చేర్చుకుంటే వారు ఆరుముఖాలు పన్నెండు చేతులు గల ఒక బాలునిగా అవతరించారట.