శ్రీ పంచమి…

0
10
శ్రీ పంచమి…

మాఘశుద్ధ పంచమిని శ్రీపంచమి అంటారు. బ్రహ్మ వైవర్తపురాణాలలో ఈ తిధి మహిమ ప్రస్తావించబడింది. సరస్వతీ దేవీ ప్రాదుర్భవించిన పుణ్యదినాన సరస్వతి దేవీ పుస్తకాది రూపాలలో విగ్రహంలో ఆవాహన చే పూజించితే అభీష్టాలన్నీ సిద్ధిస్తాయి మేధాశక్తి విద్య ధారణ స్ఫరణ ప్రజ్ఞ వాక్కు మొదలైన బుద్ధి శక్తులు వృద్ధి చెందుతాయి ధవళ కుసుమాలతో తెల్లని పూలతో సరస్వతీ దేవిని పూజించి క్షీరాన్నం నారికేళం అరటిపళ్ళు నివేదన చేసి సరస్వతీ దేవిని స్తుతిస్తే ఆ తల్లి అనుగ్రహం లభిస్తుంది దేవతలు సైతం ఈరోజున సరస్వతీ దేవిని ఆరాధిస్తారు సరస్వతీ కృపవల్లనే జ్ఞాన విజ్ఞానదులు వృద్ధి చెందుతాయి లౌకికమైన చదువులు పరమమైన బ్రహ్మా విద్య రెండూ ఈ జగజ్జనని కృపవల్లనే లభిస్తాయి.

                                                                                                                     డెస్క్:దుర్గ 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here