శ్రీకాంత్ మరోసారి తండ్రి అయ్యాడు

0
3
శ్రీకాంత్ మరోసారి తండ్రి అయ్యాడు

సీనియర్ హీరో శ్రీకాంత్ తండ్రి అయ్యాడు..అదేంటి ఆల్రెడీ తండ్రి అయ్యాడు కదా ..మళ్లీ తండ్రి అవడం ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా..మీము చెప్పేది తెరపై తండ్రి గురించి. దశాబ్దాల క్రితం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శ్రీకాంత్.. మొదట విలన్ వేషాలతో ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత హీరోగా మారాడు. వరుస ఫ్యామిలీ కథలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ఆడియన్స్ చేత ఫ్యామిలీ హీరో అనిపించుకున్నాడు. ఆ తర్వాత యంగ్ హీరోల రాకతో శ్రీకాంత్ హావ తగ్గుతూ వచ్చింది.

ఏడాదికి మూడు , నాల్గు సినిమాలు చేసినప్పటికీ అవి ప్లాప్స్ అవ్వడం తో అవకాశాలు కరువయ్యాయి. దీంతో మళ్లీ విలన్ గా యుద్ధం శరణం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ కావడం శ్రీకాంత్ కు పెద్ద మైనస్ అయ్యింది. హీరో అవకాశాలు లేక క్యారెక్టర్ పాత్రలు రాక..చివరకు విలన్ వేషాలు సైతం తలుపు తట్టకపోయేసరికి ఇప్పుడు తండ్రి పాత్రలు చేసేందుకు ఓకే చెపుతున్నాడు.

రాహుల్ విజయ్ హీరోగా కన్నడ లో విజయం సాధించిన ‘కాలేజీ కుమార’ అనే చిత్రాన్ని తెలుగు, తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు వెర్షన్ లో హీరోకి తండ్రి గా శ్రీకాంత్ నటించనుండగా తమిళ వెర్షన్ లో ప్రభు నటిస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సంతు ఈ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు. ఏప్రిల్ మూడో వారంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కానుందని సమాచారం. మరి తండ్రి పాత్రలైనా సక్సెస్ అవుతాయో చూడాలి.