ఒక్క రోజులో ఆరు అడుగులు పెరిగిన శ్రీశైలం జలాశయ నీటిమట్టం!

0
3
ఒక్క రోజులో ఆరు అడుగులు పెరిగిన శ్రీశైలం జలాశయ నీటిమట్టం!

(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • నిండుతున్న శ్రీశైలం జలాశయం
  • ఎగువ నుంచి 1.76 లక్షల క్యూసెక్కుల వరద
  • 810 అడుగులకు చేరిన నీటిమట్టం

                        వివరాల్లోకి వెళితే…జూరాల నుంచి వస్తున్న వరద నీటితో శ్రీశైలం జలాశయం శరవేగంగా నిండుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వస్తున్న నీటిని వస్తున్నట్టుగా దిగువకు విడుదల చేస్తుండటం, మరోవైపు జూరాల నిండుకుండగా మారడంతో రిజర్వాయర్ నుంచి శ్రీశైలానికి 1,76,824 క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీరంతా శ్రీశైలానికి వస్తోంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నిల్వ 215.80 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 34.24 టీఎంసీల నీరు ఉంది. పూర్తి స్థాయిలో నీరు నిండితే 885 అడుగుల మేరకు నీరు ఉంటుంది. నిన్న ఉదయం జలాశయంలో 804 అడుగుల వరకూ నీరుండగా, వరద నీటి రాక ప్రారంభం కావడంతో, ఈ ఉదయం 810 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ఈ వరద మరింతకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.