హైదరాబాద్ లో పది పబ్ లపై ఉక్కుపాదం… సీజ్!

0
3
హైదరాబాద్ లో పది పబ్ లపై ఉక్కుపాదం… సీజ్!

హైదరాబాద్ :(టిన్యూస్10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పబ్ లపై దాడులు
  • నిబంధనలకు అనుగుణంగాలేని పబ్ లు
  • 10 పబ్ లను సీజ్ చేసిన అధికారులు

                                         వివరాల్లోకి వెళితే…హైదరాబాద్ లోని పబ్ లపై గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పబ్ లపై ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు నియమ నిబంధనలను పాటించని పబ్ లను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో ఉన్న అన్ని పబ్‌ లపై దాడులు చేసిన అధికారులు, అగ్నిమాపక ఏర్పాట్లు, వ్యాపార అనుమతి లేని పది పబ్‌ లను సీజ్ చేశారు. ఈ విషయాన్ని ఖైరతాబాద్‌ జోన్‌ కమిషనర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ మీడియాకు వెల్లడించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతంలో మొత్తం 48 పబ్ లు ఉండగా, వాటిల్లో కేవలం 12 మాత్రమే నిబంధనలకు అనుగుణంగా నడుస్తున్నాయని, మరో 26 పబ్ లకు నోటీసులు జారీ చేశామని, అవి మారకుంటే, దశలవారీగా వాటిని కూడా సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు.