కంగుతిన్న నికోలస్ ….

0
12
కంగుతిన్న నికోలస్ ….

1.దుమ్ముదులిపిన భారత్ ఆటగాడు
2.కెరియర్లో అతిపెద్ద విజయాన్ని అందుకున్న ప్రజ్ఞేష్
3.విజయాన్ని అందుకున్న టెన్నిస్ ఆటగాడు

భారత టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేష్‌ గణేస్వరన్ తన కెరియర్లో అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఇండియన్‌ వెల్స్‌ ఏటీపీ మాస్టర్స్‌ టోర్నీలో వరల్డ్‌ నెంబర్‌ 18 జార్జియాకు చెందిన నికోలజ్‌ బాసిలాష్‌విలిని 6-4, 6(6)-7, 7-6(4) తేడాతో ఓడించాడు. రెండు గంటల 32 నిమిషాలపాటు కొనసాగిన ఈ పోరులో వరల్డ్‌ నెంబర్‌ 97 ప్రజ్నేష్‌ తొలి సెట్లో ప్రత్యర్థి ఐదో గేమ్‌ను బ్రేక్‌ చేసి లీడ్‌ను పొంది సెట్‌ను సొంతం చేసుకున్నాడు. నా ఆట టాప్‌ 20 ర్యాంకుల్లో ఉన్న ఆటగాడివలే ఉంది’ అని అన్నాడు. నా ప్రత్యర్థి బాసిలాష్‌విలి దూకుడు ఆటగాడు. బంతిని గట్టిగా బాదుతాడు. దానికి బదులివ్వడానికి తగినంత సమయం కూడా చిక్కకున్నప్పటికి.. నేను నా దైన శైలిలో విరుచుకుపడ్డాను. నేను ఇప్పడివరకు ఆడిన మ్యాచుల్లో ఇదే అత్యుత్తమమైన మ్యాచ్‌. మానసికంగా ఇటువంటి మ్యాచ్‌ ఆడేందుకు సరైన ఆటగాడినని నిరూపించుకున్నాను అని ప్రజ్నేష్‌ పేర్కొన్నాడు. మూడో సెట్లో నేను 5-3 తేడాతో గెలిచి ఉండాల్సింది. రెండో సెట్లో కూడా నాకు చాలా అవకాశాలు వచ్చాయి. అప్పుడు కొంచెం అప్రమత్తతో ఆడితే నేననుకున్న తేడాతో విజయం పొందేవాడిని అని ప్రజ్నేష్‌ చెప్పాడు. తర్వాతి రౌండ్లో ప్రజ్నేష్‌ వరల్డ్‌ నెంబర్‌ 89 ఆటగాడు క్రొయేషియాకు చెందిన ఐవో కార్లోవిక్‌తో తలపడనున్నాడు.

                                                                                                                డెస్క్: రెడ్డి