సగ్గుబియ్యం ఖీర్.

1
12
సగ్గుబియ్యం ఖీర్.
కావలసిన పదార్థాలు:
  • సగ్గుబియ్యం – పావు కప్పు,
  • నీళ్లు – అరకప్పు, పాలు – మూడు కప్పులు,
  • చక్కెర – పావుకప్పు,
  • బాదంపప్పులు – పది,
  • కిస్ మిస్ – పది,
  • యాలకుల పొడి – చిటికెడు,
  • నెయ్యి – నాలుగు చెంచాలు.
తయారీ విధానం:
చెంచాడు నేతిలో జీడిపప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెటు్టకోవాలి.
సగ్గుబియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. తర్వాత ఆ నీళ్లు ఒంపేసి, మళ్లీ మంచినీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. సగ్గుబియ్యం ట్రాన్స్ పరెంట్ గా అయ్యేవరకూ ఉడికించాలి.
తర్వాత మంట సిమ్ లో పెట్టి పాలు పోయాలి.
ఓ ఐదు నిమిషాల పాటు ఉడికించాక చక్కెర, యాలకుల పొడి వేసి మూత పెట్టాలి.
అడుగంటకుండా మధ్యమద్యల్లో కలుపుతూ ఇరవై, ఇరవై అయిదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆపైన జీడిపప్పు, కిస్ మిస్ వేసి, నెయ్యి కూడా వేసి కలిపి దించేయాలి.
                                                                                                           డెస్క్:దుర్గ

1 COMMENT

Comments are closed.