సమ్మర్‌ స్పెషల్‌…… పిస్తా కుల్ఫీ….

0
13
సమ్మర్‌ స్పెషల్‌…… పిస్తా కుల్ఫీ….
తయారీకి కావలసినవి:
  • పాలు – 1 లీటరు.
  • పంచదార – 250 గ్రా.
  • బ్రెడ్‌ – ఒక స్లైస్‌ (చివర్లు కట్‌చేసి వైట్‌ది మాత్రమే తీసుకోవాలి).
  • బాదంపప్పు – 20 (నీళ్లలో నానబెట్టి పై పొట్టుతీసి గ్రైండ్‌ చేసుకోవాలి).
  • పిస్తాపప్పు – అర కప్పు (పైన పొట్టు తీసేసి, పలుకులుగా చేసుకోవాలి).
  • ఏలకులు – 4.
  • కుంకమపువ్వు – రెండు, మూడు రేకలు.
తయారీ విధానం: పాలు అరలీటర్‌ అయ్యేంత వరకు మరిగించాలి.పాలు చల్లారాక ఇందులో పంచదార, బ్రెడ్, బాదంపప్పుపొడి, పిస్తాపప్పు, ఏలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి.కుల్ఫీ చేసే మౌల్డ్‌లో సిల్వర్‌ ఫాయిల్‌సెట్‌ చేసి అందులో పాలమిశ్రమం పోయాలి. ఐస్‌క్రీమ్‌ పుల్లను కూడా అమర్చాలి.పన్నెండు గంటలపాటు కుల్ఫీమౌల్డ్‌ని ఫ్రీజర్‌లో ఉంచాలి.కుల్ఫీ మౌల్డ్స్‌ని వేడినీటిలో ముంచితీస్తే ఫ్రీజ్‌ అయిన తర్వాత కుల్ఫీ బయటకు సులభంగా వస్తుంది.చల్ల చల్లగా పిల్లలకు అందించవచ్చు.
నోట్‌: కుల్ఫీ మౌల్డ్స్‌ లేకపోతే చిన్న గ్లాసులలో పాలమిశ్రమం పోసి ఫ్రీజర్‌లో పెట్టుకోవచ్చు.
                                                                                                             డెస్క్: లక్ష్మీ