సూర్య సరసన నయనతార, కాజల్……….

0
3
సూర్య సరసన నయనతార, కాజల్……….

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు……

  • విడుదలకి సిద్ధమైన సూర్య ‘కాప్పాన్’
  • శివ దర్శకత్వంలో యాక్షన్ మూవీ 
  • సంక్రాంతికి విడుదల చేసే ఆలోచన 

సూర్య కథానాయకుడిగా తమిళంలో ‘కాప్పాన్’ చిత్రం నిర్మితమైంది. సాయేషా సైగల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను ఈ నెల 20వ తేదీన విడుదల చేయనున్నారు. ‘బందోబస్త్’ టైటిల్ తో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఒక వైపున ఈ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే, ఆ తరువాత ప్రాజెక్టును సూర్య లైన్లో పెట్టేశాడు.దర్శకుడు శివతో కలిసి ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అజిత్ కి వరుసగా భారీ విజయాలను ఇచ్చిన శివపై సూర్య అభిమానులు గట్టి నమ్మకంతో వున్నారు. సంఖ్యా పరంగా సూర్యకి ఇది 39వ సినిమా. ఈ యాక్షన్ సినిమాలో ఆయన సరసన నాయికలుగా నయనతారను .. కాజల్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. కథానాయికల పాత్రల నిడివి సంగతి అటుంచితే, ఇద్దరి పాత్రలకి చాలా ప్రాధాన్యత వుంటుందని అంటున్నారు. ఇమాన్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయనున్నారు.