స్వీట్ రైస్ రెసిపీ ….

0
4
స్వీట్ రైస్ రెసిపీ ….
తయారీకి కావల్సిన పదార్థాలు:
  • వండి చల్లార్చిన అన్నం-7 కప్పులు.
  • పంచదార-ఒకటిన్నరకప్పు.
  • దాల్చిన చెక్క-2-4 ముక్కలు.
  • బిర్యానీ ఆకులు-2.
  • లవంగాలు-2-4.
  • నెయ్యి-4 టేబుల్ స్పూన్స్.
  • పాలల్లో నానబెట్టిన కుంకుమ రేకులు- కొన్ని.
  • కుంకుమ రంగు పుడ్ కలర్- కొన్ని చుక్కలు.
గార్నిష్ కోసం : బాదం, పస్తా పప్పులు- ఒక స్పూను చొప్పున
 తయారీ విధనం: వండిన అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకుని దానికి పంచదార కలపాలి. ఒక నాన్ స్టిక్ ప్యాన్ వేడి చేసి నెయ్యి వేసి వేడి చెయ్యాలి.నెయ్యిలో దాల్చిన చెక్క,లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. దీనిలో పంచదార కలిపిన అన్నం వేసి బాగా కలపాలి.ఈ మిశ్రమానికి పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు, కాస్త ఫుడ్ కలర్ కలపాలి. అన్నింటినీ కలిపి సన్నని మంట మీద 4-5 నిమిషాలు పంచదార కరిగేవరకూ ఉంచాలి.స్టవ్ మీద ఈ మిశ్రమాన్ని నీరు పూర్తిగా ఇగిరిపోయేవరకూ ఉంచాలి. అంతే, మీ స్వీట్ రెడీ.దీనిని సర్వింగ్ ప్లెటులో తీసుకుని బాదాం,జీడి పప్పు,పిస్తా పప్పులతో అలంకరించి పైన ఏలకుల పొడి వేసి వడ్డించడమే. ఈ స్వీట్ రైస్ చెయ్యడం ఇంత సులభం.చాలా ఇళ్ళల్లో ఈ స్వీటుని శుభ కార్యాలు ప్రారంభించే ముందు చేసుకుంటూ ఉంటారు.
                                                                                                               డెస్క్:లక్ష్మీ